తెలంగాణ

telangana

ETV Bharat / international

మరో రెండు రోజుల్లో ఉక్రెయిన్​పై రష్యా దాడి: బైడెన్ - ఉక్రెయిన్​ రష్యా వివాదం

Russia Ukraine Conflict: ఉక్రెయిన్​పై రష్యా దాడికి సిద్ధంగా ఉందని.. మరో రెండు రోజుల్లో దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మరోవైపు అమెరికా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ రష్యా ఆదేశాలు జారీ చేయడాన్ని అమెరికా తప్పుపట్టింది.

ukraine
ఉక్రెయిన్

By

Published : Feb 17, 2022, 10:24 PM IST

Updated : Feb 17, 2022, 10:58 PM IST

Russia Ukraine Conflict: మరో రెండు రోజుల్లో రష్యా.. ఉక్రెయిన్​పై దాడి చేస్తుంది అనడానికి అమెరికాకు చాలా సంకేతాలు అందాయన్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. దాడి చేసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని.. సరిహద్దు నుంచి రష్యా సైన్యాన్ని వెనక్కి తరలించకపోవడమే అందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఇతర దేశాలను తప్పుదోవ పట్టించేలా రష్యా చర్యలు చేపడుతున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు.

ఉక్రెయిన్​ వివాదంపై స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్​.. అమెరికాకు లేఖ రాశారు. అయితే ఈ లేఖ తాను ఇంకా చదవలేదన్నారు బైడెన్​.

మరోవైపు రష్యా.. తమ దేశంలోని అమెరికా సీనియర్​ దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చర్యకు గల కారణాన్ని రష్యా వెల్లడించలేదు. రష్యా వైఖరిని అమెరికా తప్పుపట్టింది. ఆ దేశం అర్థరహిత చర్యలు చేపడుతోందని పేర్కొంది.

ఇదీ చూడండి :Russia Ukraine conflict: ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో కాల్పులు..!

Last Updated : Feb 17, 2022, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details