తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉక్రెయిన్​పై అమెరికా ప్రతిపాదనకు రష్యా నో రిప్లై' - ఉక్రెయిన్​

America Russia News: ఉక్రెయిన్​లో ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రతిపాదనకు రష్యా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిందని వస్తున్న వార్తలను ఆ దేశం ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ గ్రుష్​కో స్పష్టం చేశారు.

ukraine-crisis
ఉక్రెయిన్​పై అమెరికా ప్రతిపాదనలకు రష్యా స్పందన!

By

Published : Feb 1, 2022, 11:19 AM IST

Updated : Feb 1, 2022, 7:25 PM IST

America Russia News: ఉక్రెయిన్​ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాలన్న ఉద్దేశంతో అమెరికా చేసిన ప్రతిపాదనకు రష్యా స్పందించినట్లు వస్తున్న వార్తలను ఆ దేశం ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ గ్రుష్​కో స్పష్టం చేశారు. అమెరికా ప్రతిపాదనకు రష్యా లిఖితపూర్వకంగా స్పందించిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.

"ఉక్రెయిన్​ను ఎప్పటికీ నాటోలో భాగం చేసుకుబోమని అమెరికా ప్రభుత్వం, నాటో దేశాలు చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి. రష్యా సరిహద్దులో మోహరించిన నాటో సైన్యాన్ని, ఆయుధాలను వెనక్కు పంపాలి." అని అగ్రరాజ్యానికి రష్యా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు బైడెన్ సర్కార్​లోని ముగ్గురు అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మాత్రం వారు నిరాకరించారు. ఈ అంశాలు బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు.

అయితే రష్యా లిఖితపూర్వకంగా ఇచ్చిన డిమాండ్స్​ను అమెరికా ప్రభుత్వం, నాటో దేశాలు తిరస్కరించాయని.. ఒకవేళ రష్యా డిమాండ్స్ అంగీకరిస్తే.. ఉక్రెయిన్​ను రష్యా ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నందున అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో పశ్చిమ ఐరోపా సమాఖ్యలోని దేశాలకు భద్రతా నియమాలపై ఓ సందేశం పంపారని, ఓ దేశం భద్రత వ్యవహారం మరో దేశానికి ఇబ్బంది కాకూడదన్న సందేశాన్ని అమెరికా సెక్రటరీ జనరల్ ఆంటోనీ బ్రింకెన్​ కూడా చేరవేశారు కానీ అమెరికా ప్రతిపాదనకు వివరణ కాదని చెప్పినట్లు రష్యాలోని న్యూస్ ఏజెన్సీ ఆర్​ఐఏ నోవెస్టీ స్పష్టం చేసింది.

ఇంకా చర్చిస్తున్నాం..

ఇదే విషయంపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా స్పందించారు. ఈ విషయంపై గందరగోళం ఏర్పడిందని.. అగ్రరాజ్యం ప్రతిపాదనకు వివరణ ఇవ్వాలన్నదానిపై ప్రస్తుతం చర్చిస్తున్నామని అన్నారు.

మరోవైపు ఉక్రెయిన్​లో ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని రష్యా ఆరోపిస్తోంది. కైవ్​లో స్వచ్ఛమైన నాజీలను అధికారంలోకి తీసుకొచ్చిందని విమర్శించింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 'ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా బలగాల మోహరింపు'పై వాడివేడి చర్చ జరిగింది. అందులో భాగాంగానే అమెరికా, రష్యా పరస్పరం విమర్శలకు దిగాయి.

లక్షలమంది మోహరింపు..

ఉక్రెయిన్​లో లక్షలమంది సైన్యాన్ని రష్యా మోహరించిందని అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ పేర్కొన్నారు. ఈ దశాబ్దంలో ఇంతలా బలగాల మోహరింపు జరగలేదని స్పష్టం చేశారు.

సైన్యాన్ని పెంచిన ఉక్రెయిన్​..

రష్యాతో ఉద్రిక్తతల నేపథ్యంలో బలగాలను పెంచారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెనెస్కీ. కొత్తగా లక్షమందిని సైన్యంలోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో మూడేళ్లలో ఉక్రెయిన్​లో బలగాల సంఖ్య 3లక్షల 50వేల చేరుకుంటుందన్నారు. అంతేకాక సైనికుల జీతాలను కూడా పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్​పై ఏ క్షణమైనా దాడి చేసేందుకు రష్యా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆ దేశ సరిహద్దుల సమీపంలో లక్షలాది సైనికులను మోహరించింది. అయితే ఉక్రెయిన్​పై దాడి జరిగితే నాటో బలగాలు అడ్డుకుంటాయన్న వార్తలపై ఇటీవల నాటో కీలక వివరణ ఇచ్చింది. ఉక్రెయిన్​కు బలగాలను పంపించే యోచన తమకు లేదని స్పష్టం చేసింది. కానీ పరోక్షంగా మద్దతు ఇచ్చే విషయంపై దృష్టి సారిస్తామని పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:మరో 'సారీ' చెప్పిన బోరిస్‌ జాన్సన్‌

Last Updated : Feb 1, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details