తెలంగాణ

telangana

ETV Bharat / international

రోబోల ఫుడ్ డెలివరీ- ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే ఇంటికి! - ఫుడ్​ డెలివరీ చేస్తున్న రోబోలు

ఫుడ్‌ డెలివరీ చరిత్రలో కొత్త అధ్యయానికి అగ్రరాజ్యం అమెరికాలో నాంది పడింది. ఇప్పటివరకూ ఆహారాన్ని వాహనాల ద్వారా డ్రోన్ల సాయంతో సరఫరా చేస్తుండగా తొలిసారి ఓ సంస్థ రోబోల ద్వారా వాటిని చేరవేస్తూ (Robot Food Deliveries) వహ్వా అనిపిస్తోంది. కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో వ్యక్తి ప్రమేయం లేని ఫుడ్‌ సరఫరా విధానం ఆహార సరఫరాలో పెనుమార్పులు తీసుకురానుంది.

Robot Food Deliveries
ఆహారాన్ని చేరవేస్తున్న నయా రోబోలు

By

Published : Nov 2, 2021, 12:00 PM IST

శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో రోబోల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి వీటి అవసరం యావత్‌ మానవళికి ఎక్కువైంది. వ్యక్తులే కరోనాకు వాహకాలుగా మారిన తరుణంలో ప్రతి రంగానికి రోబో సేవలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫుడ్‌ డెలివరీ సైతం వ్యక్తి ప్రమేయంగా లేకుండా సరఫరా చేసేందుకు (Robot Food Deliveries) సరికొత్త రోబోను స్టార్‌షిప్‌ టెక్నాలజీస్‌ తయారు చేసింది.

ఆహారాన్ని సరఫరా చేస్తున్న రోబోలు

జీపీఎస్​ సాయంతో..

ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లోని కాలేజీ క్యాంపస్‌లలో ఈ రోబోలు సేవలు (robot food server) అందిస్తున్నాయి. మోకాళ్ల ఎత్తున్న చిన్నపాటి రోబోలు నాలుగు లార్జ్‌ సైజ్‌ పిజ్జాలను సైతం మోసుకెళ్లేలా వీటిని రూపొందించారు. గంటకు 5మైళ్ల వేగంతో గమ్యస్థానాలకు ఆహారాన్ని చేరవేసేలా రోబోలను నిర్మించారు. వీటికి అమర్చిన కెమెరాలు, సెన్సర్లు, జీపీఎస్‌, లేజర్‌ స్కానర్లు రోబో స్వయంగా ముందుకు కదిలేందుకు దోహదం చేస్తాయి. కెమెరాల సాయంతో ఎదురున్న అడ్డంకులను అధిగమించటం సహా జీపీఎస్​ సాయంతో నిర్దేశించిన గమ్యస్థానానికి నిమిషాల్లోనే రోబోలు చేరుకుంటున్నాయి.

కెమెరా, సెన్సార్ల సాయంతో అడ్డంకులను అధిగమిస్తున్న రోబోలు

అలా పనిచేస్తుంది..

రోబో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత వినియోగదారుడు (robot server news) అందులో ఉండే ఆహారాన్ని పొందాలంటే కోడ్‌ టైప్‌ చేయాల్సి ఉంటుంది. తన మొబైల్‌ ఫోన్‌లో కోడ్‌ నెంబర్‌ను కొట్టిన తరువాత రోబోకున్న డోర్లు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి. అప్పుడు మాత్రమే కస్టమర్‌ ఆహారాన్ని తీసుకునేందుకు వీలు పడుతుంది. రోబో సేవలను పలు క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. రోబో సేవలు అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడుతున్నారు.

ఆహారాన్ని చేరవేస్తున్న నయా రోబోలు

2019లోనే స్టార్‌షిప్‌ టెక్నాలజీస్‌ ఫుడ్‌ డెలివరీ రోబోలను (Robot Food) అందుబాటులోకి తెచ్చింది. కరోనా విజృంభణ అనంతరం వీటి డిమాండ్‌ బాగా పెరగడంతో ప్రారంభంలో 250గా ఉన్న రోబోల సంఖ్యను వెయ్యికి పైగా పెంచుకుంది. రానున్న రోజుల్లో మరింతగా రోబోల సంఖ్యను పెంచాలని స్టార్‌షిప్‌ టెక్నాలజీ భావిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని 20 క్యాంపస్‌లలో ఫుడ్‌ డెలివరి రోబోలు సేవలందిస్తుండగా త్వరలో మరో 25 క్యాంపస్‌లు వీటికి జత కానున్నట్లు సంస్థ పేర్కొంది.

అమెరికా, బ్రిటన్‌ కాలేజీ క్యాంపస్‌లకు ఆహారం సరఫరా

ఇదీ చదవండి:సీఎం చేతిపై మహిళ ముద్దుల వర్షం.. వీడియో వైరల్

అంబులెన్స్​కు దారిచ్చిన సీఎం కాన్వాయ్​.. ముఖ్యమంత్రే స్వయంగా...

ABOUT THE AUTHOR

...view details