తెలంగాణ

telangana

ETV Bharat / international

కృత్రిమ మేధతో 'రోబో సైనికులు' వస్తున్నారు!

యుద్ధ సమయంలో సైనికులకు సాయపడేందుకు భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు గల రోబోలు రాబోతున్నాయి. దీనిపై పరిశోధనలు చేస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. మనుషుల మెదడు పనితీరు ఆధారంగా కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేస్తున్నారు.

By

Published : Apr 8, 2019, 10:53 AM IST

రోబో

మీరు రోబో చిత్రం చూశారా! సైన్యానికి సేవలందించాలనే ఉద్దేశంతో రోబో తయారు చేస్తాడు రజనీ. కానీ అది ప్రేమ అంటూ వేరే పంథాలో వెళ్తుంది. ఒకవేళ రోబో సైన్యానికి సాయపడితే ఇంకోలా ఉంటుంది. ఇదే ఆలోచనతో భవిష్యత్తులో రోబోలకు కృత్రిమ మేధస్సును అందించనున్నారు. యుద్ధక్షేత్రంలో సైనికులకు సాయపడేలా రోబోల్లో సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు అమెరికా పరిశోధకులు.

ఎలా పనిచేస్తుంది?

మిలిటరీ ఆపరేషన్లలో సైనికులు రకరకాల నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ముందే గ్రహించే సామర్థ్యాన్ని కృత్రిమ మేధస్సు ద్వారా రోబోలకు అందించనున్నారు శాస్త్రవేత్తలు. దీనికోసం సైనికుల స్థితిని, ప్రవర్తనను పరిశీలించింది యూఎస్ సైనిక పరిశోధన విభాగం.

ఏ విధంగా తయారు చేస్తారు?

ముందుగా మెదడు పనితీరును అంచనా వేశారు పరిశోధకులు. ఒక పని పూర్తి చేసేందుకు మెదడు ఎన్ని రకాలుగా ఆలోచనలు రేకిత్తిస్తుందో లెక్కగట్టారు. మనుషుల ఆలోచనలు ముందుగానే పసిగట్టేందుకు కంప్యూటర్​తో ప్రేరేపించారు. ఇందుకోసం 30 మందిని ఎంపిక చేశారు. మెదడులోని ఆలోచనలు రేక్తెత్తించే సంకేతాలను పరిశీలించేందుకు కంప్యూటర్ సాయంతో ఒకరినొకరికి అనుసంధించారు. ఒక్కొక్కరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అంచనా వేశారు. ఈ మొత్తం వ్యవస్థతో సాంకేతికతను అభివృద్ధి చేసి రోబోల్లో అమర్చనున్నారు పరిశోధకులు.

"సైనికుల ఆలోచనలను మందుగానే పసిగడతాయి కృత్రిమ మేధస్సుగల రోబోలు. శత్రువు నుంచి ఎదురయ్యే సమస్యలు ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది వీటి ద్వారా ముందే తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ రోబోల ద్వారా సమస్య తీవ్రతపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. పరిష్కారాన్ని సులభంగా కనిపెట్టవచ్చు" -జీన్ వెట్టెల్​, న్యూరో సైంటిస్ట్​

ఈ రోబోలతో భవిష్యత్తులో సరిహద్దు కాపలా మరింత సులభం కానుంది. కృత్రిమ మేధస్సు ద్వారా పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా శాస్త్రసాంకేతిక రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details