అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్ (72) తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవల న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి తన సోదరుడు మృతి చెందినట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
"నా సోదరుడు రాబర్ట్ తుది శ్వాస విడిచాడని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. రాబర్ట్ నా సోదరుడు మాత్రమే కాదు, మంచి స్నేహితుడు కూడా. మమ్మల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లినప్పటికీ.. నా సోదరుడి జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. రాబర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
తీవ్ర అస్వస్థతకు గురైన రాబర్ట్‌ను కొన్నిరోజులు నుంచి ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్.. శుక్రవారమే తన తమ్ముడిని చూసేందుకు న్యూయార్క్‌కు వెళ్లారు.
ఫైనాన్స్ర్ గా ప్రస్థానం...
డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి రాబర్ట్ ట్రంప్ కూడా కుటుంబ వ్యాపారాలైన రియల్ఎస్టేట్ విభాగంలో పని చేశారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత ఆత్మీయుల్లో రాబర్ట్ కూడా ఒకరు.మొదట వాల్‌స్ట్రీట్‌లో ఉన్న ఓ కార్పొరేట్ ఫైనాన్స్‌లో పనిచేసేవారు. కొంత కాలం తర్వాత కుటుంబ వ్యాపారంలోకి అడగుపెట్టారు. ట్రంప్ సంస్థలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్‌ను నిర్వహించారు.
ఇదీ చూడండిటైమ్స్ స్క్వేర్‌లో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా