ఊపిరితిత్తులపై దాడిచేసే ఫ్లూ పీడితులతో పోలిస్తే.. ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే కొవిడ్-19 బాధితులకు మరణ ముప్పు ఐదు రెట్లు అధికమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐసీయూ, వెంటిలేటర్ల అవసరం కూడా వీరికి ఎక్కువేనని పేర్కొంది. ఫ్లూ కేవలం ఊపిరితిత్తుల పైనే ప్రభావం చూపుతుందని, కరోనా మాత్రం ఇతర అవయవాల పైనా దుష్ప్రభావం చూపుతోందని విశ్లేషించింది. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు.
కొవిడ్‌తో మరణ ముప్పు ఐదు రెట్లు అధికం - Coronavirus deaths study
ఫ్లూ తో పోలిస్తే కరోనాతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చేవారికే మరణ ముప్పు ఐదు రెట్లు అధికంగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఫ్లూ కేవలం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని, కరోనా మాత్రం ఇతర అవయవాలపైనా దుష్ప్రభావం చూపుతోందని విశ్లేషించింది.
అమెరికాలోని వృద్ధుల సంక్షేమశాఖ నిర్వహించే సమీకృత ఆరోగ్య సేవల వివరాలను పరిశోధకులు సేకరించారు. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 17 మధ్య కొవిడ్‌కు గురై ఆసుపత్రిపాలైన 3,641 మంది వైద్య పరీక్షల ఫలితాలనూ; 2017-19 మధ్య ఫ్లూ కారణంగా ఆసుపత్రిపాలైన 12,676 మంది ఆరోగ్య వివరాలనూ విశ్లేషించారు. ఫ్లూ కారణంగా 674 మంది చనిపోగా, కొవిడ్‌తో 676 మంది ప్రాణాలు విడిచినట్టు లెక్క తేలింది. ఫ్లూ బాధితులతో పోలిస్తే కొవిడ్ పీడితులకు ఐసీయూ అనసరం 2.5 రెట్లు, బ్రీతింగ్ యంత్రాల అవసరం 4 రెట్లు అధికమని విశ్లేషించింది.