తెలంగాణ

telangana

ETV Bharat / international

Space tour: 'బెజోస్​తో అంతరిక్ష యాత్ర ఊహించలేదు' - స్పేస్ టూర్

మంగళవారం.. ప్రపంచ కుబేరుడు, ఆమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అయితే.. ఆయనతో పాటు తన సోదరుడినీ స్పేస్​ టూర్​(space tour)కు రమ్మని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం తనను ఆశ్యర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చారు జెఫ్​ బెజోస్ సోదరుడు మార్క్​ బెజోస్.

jeff bezos, space tour
జెఫ్ బెజోస్, మార్క్ బెజోస్

By

Published : Jul 19, 2021, 10:01 AM IST

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్​తో పాటు అంతరిక్షయానానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఆయన సోదరుడు మార్క్​ బెజోస్. సొంత సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న తొలి మానవసహిత రోదసి యాత్రకు మంగళవారం (జులై 20న) పయనం కానున్నారు ఈ బెజోస్​ సోదరులు. అయితే.. తొలుత ఆయనతో పాటు స్పేస్​(space tour)కు రమ్మని జెఫ్​ బెజోస్​ అడిగినప్పుడు మార్క్​ చాలా ఆశ్యర్యానికి గురైనట్లు చెప్పుకొచ్చారు.

జెఫ్ బెజోస్, మార్క్ బెజోస్

"మొదటి వ్యోమనౌకలోనే జెఫ్​ వెళ్తున్నాడని నేను అస్సలు ఊహించలేదు. తనతోపాటు నన్ను కూడా రమ్మనడం నాకు ఎంతో ఆశ్యర్యాన్ని కలిగించింది. ఓ సాహసం చేసే అద్భుతమైన అవకాశం నాకు లభించింది. నా ప్రాణ స్నేహితుడు(జెఫ్​)తో స్పేస్​ టూర్ అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా."

--మార్క్ బెజోస్.

అయితే.. ఆయనతో పాటు తన సోదరుడు స్పేస్​ టూర్​కు వస్తే బాగుంటుందని తొలుత జెఫ్​ బెజోస్​ మార్క్​ను అడిగారు. దీనిపై మార్క్ హర్షం వ్యక్తం చేశారు.

సోదరుడిని స్పేస్​ టూర్​కు ఆహ్వానించిన జెఫ్​ బెజోస్

రెండు రికార్డులు..

బెజోస్ అంతరిక్ష యాత్రలో రెండు అరుదైన రికార్డులు నమోదు కానున్నాయి. ఈ కుబేరుడితో కలిసి 18 ఏళ్ల ఆలివర్‌ డేమన్‌ రోదసియాత్ర చేయబోతున్నారు. దీంతో అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందబోతున్నారు. అదే యాత్ర కోసం ఇప్పటికే ఎంపికైన వేలీ ఫంక్‌ (82).. అత్యంత ఎక్కువ వయసున్న వ్యోమగామి కానున్నారు.

బ్లూ ఆరిజిన్

స్పేస్​ టూర్​ అనంతరం అపర కుబేరుడు బెజోస్ వ్యోమగాముల జాబితాలో చేరనున్నారు. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగుల వేస్తోన్న 'స్పేస్ టూరిజం' రంగానికి ఈ నెలలోనే ఇది రెండో పెద్ద ఘట్టం!. జులై 20న పశ్చిమ టెక్సాస్​ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్​ సైట్​ వన్​ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు) న్యూ షెపర్డ్​ దూసుకెళ్లనుంది. దీనిని గంటన్నర ముందు నుంచే BlueOrigin.comలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

బిలినియర్ల మధ్య రోదసియానానికి తీవ్ర పోటీ నెలకొన్న వేళ ఇటీవలే దానిని విజయవంతంగా పూర్తి చేశారు వర్జిన్​ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్.

ఇదీ చదవండి:

బెజోస్‌ వ్యోమనౌక వెనుక.. భారత యువతి

Space Tour: బెజోస్​ రోదసి యాత్రతో అరుదైన రికార్డు

ABOUT THE AUTHOR

...view details