రక్త క్యాన్సర్ చికిత్సకు కొత్త ఔషధాలను అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఇందులో భారత సంతతికి చెందిన బాబల్ కాంత్ ఝూ కూడా ఉన్నారు. వీరు కనుగొన్న టీఈటీఐ 76 చికిత్సా విధానం... వ్యాధి ఆరంభ దశలో క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకొని వాటిని నాశనం చేస్తుంది.
రక్త క్యాన్సర్‌కు కొత్త మందులు - TET2 cells
రక్త క్యాన్సర్ చికిత్సకు కొత్త ఔషధాలను కనిపెట్టారు అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ శాస్త్రవేత్తలు. వీరిలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం.

రక్త క్యాన్సర్‌కు కొత్త మందులు
టీఈటీ2 జన్యువుల్లో మార్పులు కారణంగా రక్త క్యాన్సర్ కారక కణాలు ఏర్పడతాయి. ఈ టీఈటీ2 జన్యువులపై దాదాపు దశాబ్దం పాటు పరిశోధన అనంతరం ఈ మందును శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రి క్లీనికల్ ట్రయల్స్‌లో టీఈటీఐ76 విజయవంతమైందని వారు పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని 'బ్లడ్ క్యాన్సర్ డిస్కవరీ' తాజా సంచికలో ప్రచురించింది.
ఇదీ చదవండి:ఇజ్రాయెల్‌పై గాజా రాకెట్ దాడులు