తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్పత్రిలో ట్రంప్..సందిగ్ధంలో రిపబ్లికన్ల ఎన్నికల ప్రచారం - latest international news

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. నవంబరులో జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో పాల్గొన్న ఆయన.. మరో రెండు చర్చాగోష్ఠి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ సందిగ్ధంలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచార కార్యక్రమాలను వాయిదా వేయటం లేదా వర్చువల్‌గా నిర్వహించటమనే రెండు మార్గాాలే ఉన్నాయని ట్రంప్ ప్రచార నిర్వహకుడు తెలిపారు.

republicans worrying about election campaign after trump tested corona postive
ట్రంప్‌నకు కరోనా.. ప్రచారం సంగతేంటి?

By

Published : Oct 4, 2020, 4:39 AM IST

అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉండగా డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తొలుత అధికార నివాసం వైట్‌హౌస్‌లోనే ఉంటానన్న ట్రంప్‌.. వైద్యనిపుణుల సూచనల మేరకు వాషింగ్టన్‌లోని వాల్డర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో పాల్గొన్న ట్రంప్‌.. ఎన్నికలలోగా మరో రెండు చర్చాగోష్ఠి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితిలో ప్రచార కార్యక్రమాలను వాయిదా వేయటం లేదా వర్చువల్‌గా నిర్వహించటం అనే రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయని ఆయన ప్రచార నిర్వాహకుడు బిల్‌ స్టెపియన్‌ వెల్లడించారు.

'అధ్యక్షుడు ట్రంప్‌ పాల్గొనాల్సిన అన్ని ప్రచార కార్యక్రమాలను వర్చువల్‌ రూపంలోకి మార్చే ఏర్పాటు కొనసాగుతోంది. ఆ విధంగా చేయటం సాధ్యం కాకపోతే వాయిదా వేస్తాం. అంతేకాకుండా అధ్యక్షుడి కుటుంబ సభ్యులు భాగం కావాల్సిన కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి' అని స్టెపియన్‌ వివరించారు. కాగా, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రచార కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా కీలకమైన ఈ దశలో ట్రంప్‌ అందుబాటులో లేకపోతే ఆయన విజయావకాశాలపై నీలినీడలు కమ్ముకున్నట్లే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరో వైపు ఎన్నికలు జరిగే నవంబర్‌ 3లోగా ట్రంప్‌ కరోనా నుంచి కోలుకుంటే ఆయన ఈ కొవిడ్‌ విపత్కర పరిస్థితిలో ఆశావాదానికి చిహ్నంగా నిలవచ్చని.. నయం కానట్లయితే సానుభూతితో గెలిచే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details