అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. గెలిచినట్లు ముందుగానే ప్రకటించటం, కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును నిలిపేయాలని కోరడాన్ని కొంత మంది రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. ఫలితంగా ట్రంప్ ప్రయత్నాలకు పార్టీలోని కీలక నేతల మద్దతు కరవైంది.
ట్రంప్ వైఖరిని వ్యతిరేకించిన వారిలో రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్కానెల్, మార్కో రుబియో, లీసా ముర్కోస్కీ, ఆడమ్ కింజింజర్ వంటి కీలక నేతలు ఉన్నారు. న్యాయంగా వేసిన ఓట్లను ఎన్ని రోజులు లెక్కించినా తప్పు కాదని, ఫలితాల విషయంలో ప్రతి ఒక్కరూ ఓపికగా ఎదురుచూడాలని సూచించారు.
"ఇక చాలు.. ఆపండి. మీరు గెలిచినా ఓడినా.. ఓట్లను లెక్కించాల్సిందే. అమెరికా దాన్ని అంగీకరిస్తుంది. ఓపిక చాలా విలువైనది" అని కింజింజర్ నేరుగా ట్రంప్‌కే ట్వీట్ చేశారు.
నిక్కీ హేలీపై విమర్శలు..