క్యూబా, చైనాలోని తమ దేశ దౌత్యవేత్తలు అనూహ్యంగా అనారోగ్యానికి గురైన ఘటనలపై అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. మైక్రోవేవ్ రేడియేషన్లకు వారు గురికావడమే అనారోగ్యానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువని నివేదిక పేర్కొంది. అయితే ఈ రేడియేషన్లను వారిపై ప్రయోగించారని ఆరోపించింది.
2016లో క్యూబా రాజధాని హవానాలో అనుమానాస్పద స్థితిలో ఓ అమెరికా సిబ్బంది అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత ఇదే తరహాలో 2017-18లో క్యూబాతో పాటు చైనాలోనూ అమెరికా, కెనడా దౌత్యవేత్తలు అస్వస్థతకు గురయ్యారు. వీరు తీవ్ర ఒత్తిడి, తల నొప్పి, మైకాన్ని అనుభవించారు. అదే సమయంలో తెలిసిన విషయాలను గుర్తుతెచ్చుకోవడం, కొత్తవాటిని అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బందిపడ్డారు.
ఈ ఘటనలపై అమెరికాకు చెందిన 19 సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టింది.