అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గతేడాది సంభించిన కార్చిచ్చుకు కారణం.. చెట్టు కొమ్మ కరెంటు స్తంభానికి తాకడమేనని అధికారులు సోమవారం వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర అగ్నిమాపక శాఖ నివేదిక రూపొందించింది.
"సుదీర్ఘ దర్యాప్తు తర్వాత మాకు ఘటనకు గల కారణం స్పష్టమైంది. ఇగో కమ్యూనిటీలో పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంస్థ ఏర్పాటు చేసిన విద్యుత్ లైనును పైన్ చెట్టు కొమ్మలు తాకాయి. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగి అది కాస్తా కార్చిచ్చుగా మారింది. నివేదికను షాస్తా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయానికి పంపించాము."