అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ కామెంట్ ఫోరమ్ రెడ్డిట్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్న 'ట్రంప్ ఫోరమ్' వెబ్‌సైట్‌ను నిషేధించింది. ట్రంప్ ఫోరమ్ చాలా తరచుగా తమ నిబంధనలను ఉల్లంఘించిందని, హింసను ప్రోత్సహించిందని వెల్లడించింది రెడ్డిట్. తీరు మార్చుకునేందుకు గతంలో అవకాశం కల్పించినట్లు పేర్కొంది.
'ట్రంప్ ఫోరమ్'కు షాక్- నిషేధించిన రెడ్డిట్
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నవేళ సామాజిక మాధ్యమాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రాజకీయ, విద్వేష పూరిత ప్రసంగాలను పలు సామాజిక మాధ్యమ సంస్థలు నిషేధిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుగా పోస్టులు పెట్టే ట్రంప్ ఫోరమ్‌ను తాజాగా నిషేధించింది రెడ్డిట్. తరచుగా నిబంధనలను ఉల్లంఘించడమే కారణమని తెలిపింది.
ట్రంప్ మద్దతుదారులైతే మాకేంటీ.. నిబంధనలే ప్రథమం: రెడ్డిట్
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ప్రసారమయ్యే రెడ్డిట్ సైట్ల ప్రక్షాళనలో భాగంగా 2,000 ఉప ట్రంప్ ఫోరమ్‌లను తొలగించినట్లు వెల్లడించింది. తాము తొలగించినవాటిలో చాలా వరకు నిరుపయోగమైనవి, తక్కువ వినియోగదారులు ఉన్నవేనని తెలిపింది.