అమెరికాలోని టెనస్సీలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధులన్ని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లుపై ఉన్న వాహనాలు నీటమునిగాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గృహసముదాయాలు, వాహనాల నుంచి ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక సిబ్బంది. ఆదివారం నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.
అమెరికాలో వరద బీభత్సం- నలుగురు మృతి - వరదలు
అమెరికాను మరోసారి వరదలు వణికిస్తున్నాయి. టెనస్సీలో భారీ వర్షాలకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నాష్విల్ నగరంలో ఎమర్జెన్సీ విధించిన అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
![అమెరికాలో వరద బీభత్సం- నలుగురు మృతి Record rains cause flash flooding in Tennessee; 4 dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11198511-thumbnail-3x2-yv.jpg)
టెనస్సీలో వరద భీభత్సం.. నలుగురు మృతి
నాష్విల్లో భారీ వరదలు
నాష్విల్ నగరంలో శనివారం 14.6 సె.మీల వర్షపాతం నమోదైంది. దీంతో సంభవించిన వరదల కారణంగా నాష్విల్లో అత్యవసర స్థితి విధించారు అధికారులు. ఇప్పటివరకు 130 మందిని కాపాడినట్లు తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:ప్రవాసుల వెతలు తీరేదెన్నడు?