తెలంగాణ

telangana

ETV Bharat / international

7 కోట్ల 8 లక్షలమంది స్వస్థలాలను వీడారు : ఐరాస - వెనెజువెలా

స్వదేశంలో నెలకొన్న అశాంతి, అంతర్గత సమస్యల కారణంగా 2018 చివరికి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 8 లక్షలమంది వివిధ దేశాలకు వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ నివేదిక స్పష్టం చేసింది.

7 కోట్ల 8 లక్షలమంది స్వస్థలాలను వీడారు : ఐరాస

By

Published : Jun 20, 2019, 5:30 PM IST

ప్రపంచవ్యాప్తంగా 2018 చివరి నాటికి 7 కోట్ల 8లక్షల మంది వివిధ సమస్యలతో స్వస్థలాలను వీడి విదేశాలకు వెళ్లారని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది. శరణార్థుల సంఖ్య వాస్తవానికి దూరంగా ఉందని స్పష్టం చేసింది. వెనెజువెలాలో ఉత్పన్నమయిన సంక్షోభం కారణంగా కచ్చితమైన గణాంకాలు కుదరలేదని, శరణార్థులుగా వెళ్లిపోయిన వారి సంఖ్య పూర్తిగా లెక్కలోకి రాలేదని స్పష్టం చేసింది.

2017 తో పోల్చితే 6 కోట్ల 80 లక్షల 5 వేల మంది ప్రజలు హింస, అశాంతి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో శరణార్థులుగా మారారని స్పష్టం చేసింది.
అంతర్గత ఘర్షణల కారణంగా ఇథియోపియాలో వేలమంది శరణార్థులుగా మారారని, వెనెజువెలా ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహారం, సరైన వైద్య సౌకర్యం అందక శరణార్థులుగా వెళ్లేవారి సంఖ్య పెరిగిందని ఐరాస నివేదిక పేర్కొంది.

2016 ప్రారంభం నుంచి 3 కోట్ల 3 లక్షల మంది వెనెజువెలాను వీడినట్లు అంచనా వేసింది. వెనెజువెలాకు సంబంధించి శరణార్థులుగా ఆశ్రయం కల్పించాలని దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యనే నివేదికలో పేర్కొన్నామని వెల్లడించింది.

గత ఇరవై ఏళ్లలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారిసంఖ్య రెట్టింపయింది. ఇది థాయ్​లాండ్ జనాభా కంటే ఎక్కువ.

శరణార్థులుగా వేరే దేశంలో నివసించిన అనంతరం అనవసర వివాదాలు, జైలుకెళ్లే అవకాశం ఉందన్న కారణంతో తిరిగి స్వదేశాలకు వెళ్లేందుకు శరణార్థులు మొగ్గు చూపడం లేదని ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ అనే సామాజిక సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఖషోగ్గి హత్యలో సౌదీ యువరాజు హస్తముంది'

ABOUT THE AUTHOR

...view details