తెలంగాణ

telangana

ETV Bharat / international

మరింత పవర్​ఫుల్​గా కరోనా టీకా!

మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కొనే టీకాకు అమెరికా​ శాస్త్రవేత్తలు ఫార్ములాను కనుగొన్నారు. రోగనిరోధక వ్యవస్థలోని 'టి' కణాలను ప్రేరేపించే వ్యాక్సిన్ల వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని వల్ల కొత్త వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని తేల్చారు.

powerful covid vaccine, powerful vaccine for covid variants
మరింత పవర్​ఫుల్​గా కరోనా టీకా!

By

Published : Jul 7, 2021, 8:46 AM IST

కొవిడ్‌-19కు మరింత సమర్థమైన టీకాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఫార్ములాను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కరోనాలో వేగంగా పుట్టుకొస్తున్న వేరియంట్లనూ ఎదుర్కోగలదని పేర్కొన్నారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు స్పందనగా రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమయ్యే తీరు ఆధారంగా బోస్టన్‌ విశ్వవిద్యాలయం, హార్వర్డ్‌ వర్సిటీలోని బ్రాడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు.

ప్రస్తుత కొవిడ్‌ టీకాలు రోగ నిరోధక వ్యవస్థలోని 'బి' కణాలను క్రియాశీలం చేయడంపై ప్రధానంగా దృష్టిపెడుతున్నాయి. యాంటీబాడీలను సృష్టించడం ఈ కణాల బాధ్యత. రోగనిరోధక వ్యవస్థలోని 'టి' కణాలను ప్రేరేపించే వ్యాక్సిన్ల వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల కరోనా, దానికి సంబంధించిన కొత్త వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని తేల్చారు. ఈ నేపథ్యంలో 'టి' కణాల క్రియాశీలానికి కారణమయ్యే. కరోనా. భాగాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. మానవ కణాల్లో కరోనా ఉత్పత్తి చేసే 29 రకాల ప్రొటీన్ల గురించి ఇప్పటికే వారికి అవగాహన ఉంది. వైరస్‌ జన్యుక్రమంలో దాగున్న మరో 23 ప్రొటీన్లను ఆ తర్వాత గుర్తించారు. వైరస్‌పై దాడి చేయడానికి అవసరమైన సంకేతాల్లో చాలా భాగం ఈ ప్రొటీన్ల నుంచే మానవ రోగనిరోధక వ్యవస్థకు అందుతున్నట్లు తాజాగా తేల్చారు.

ఇదీ చదవండి :టీకాతో తలెత్తే రక్తపు గడ్డలకు చికిత్స

ABOUT THE AUTHOR

...view details