తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్ విజయానికి కారణాలు ఇవే.. - జో బైడెన్​ వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించారు. 77 ఎళ్ల వయసులో ఆ పదవిని చేపట్టే వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఎవరూ ఉహించని రీతిలో స్వింగ్ రాష్ట్రాల్లోనూ విజయదుందుబి మోగించి డొనాల్డ్ ట్రంప్​ను ఓడించారు. 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎట్టకేలకు అధ్యక్ష పీఠాన్ని కైసవం చేసుకున్నారు. అయితే ఆయన విజయానికి కారణాలేంటి? అమెరికా ప్రజలు ఆయనకు ఎందుకు పట్టంగట్టారు? బైడెన్​కు కలిసొచ్చిన అంశాలేంటి?

reasons for biden's resounding victory
బైడెన్ గెలవడానికి కారణాలు ఇవే..

By

Published : Nov 7, 2020, 10:37 PM IST

Updated : Nov 7, 2020, 10:43 PM IST

యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో తేలిపోయింది. రిపబ్లికన్ల​ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​పై డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. అమెరికా చరిత్రలో 77 ఏళ్ల వయస్సులో అధ్యక్షుడిగా గెలిచిన మొట్ట మొదటి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు పొందలేనన్ని ఓట్లు సాధించి మరో రికార్డూ సృష్టించారు. అంతేకాకుండా తన 50 సుదీర్ఘ రాజకీయ జీవితంలో చిరకాల స్వప్నంగా ఉన్న 'శ్వేతసౌధ అధిపతి' కలను అగ్రారాజ్యం మాజీ అధ్యక్షుడు ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు.

సర్వేలన్నీ బైడెన్​కే అనుకూలంగా ఉన్నప్పటికీ పోటీ రసవత్తరంగా సాగింది. పోస్టల్​ బ్యాలెట్​ ఓటర్లందరూ బైడెన్​కే పట్టంగట్టారు. ఫలితంగా కీలక రాష్ట్రాల్లోనూ ఆయన స్వల్ప వ్యత్యాసంతో ట్రంప్​ను అధిగమించారు. అధ్యక్ష పీఠానికి అవసరమైన మ్యాజిక్​ ఫిగర్​ను అందుకున్నారు. అయితే బైడెన్​ చారిత్రక విజయానికి దోహదపడ్డ అంశాలను ఓసారి పరిశీలిద్దాం.

ట్రంప్ వైఫల్యాలే బైడెన్​ విజయానికి సోపానాలు

  • కరోనా కట్టడిలో ట్రంప్ దారుణంగా విఫలమవ్వడం.
  • దేశంలో నల్లజాతీయులపై అకృత్యాలు పెరిగిపోవడం.
  • జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్రంప్ మాట్లాడటం.
  • నిరుద్యోగ రేటు అమెరికాలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పెరిగిపోవడం.
  • రష్యాకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు.
  • ట్రంప్ కేవలం 750 డాలర్లే ఆదాయ పన్నుగా చెల్లించారనే ఆరోపణలు.

భవిష్యత్​పై భరోసా

  • కరోనాను బైడెన్ విజయవంతంగా కట్టడి చేస్తారని ప్రతి 10 మంది ఓటర్లలో నలుగురు విశ్వసించారు.
  • అధ్యక్షునిగా ఎన్నికైతే మొదటి రోజే కరోనా నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కఠిన చర్యలు చేపడతానన్న బైడెన్​ హామీ.
  • జాతివివక్షకు తావు లేకుండా పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామనే హామీ.
  • నల్ల జాతీయురాలు కమలా హారిస్​ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం.
  • ఆసియా-అమెరికా, నల్లజాతీయుల మద్దతు కూడగట్టుకోవడంలో సఫలం
  • ఒబామా హయాంలో రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం.
  • పారిస్​ ఒప్పందంలో తిరిగి చేరుతామని ప్రకటించడం.
  • ఇరాన్​తో అణు ఒప్పంద పునరుద్ధరణపై పునరాలోచన చేస్తామనడం.
Last Updated : Nov 7, 2020, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details