తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విజృంభణ- 80 లక్షలకు చేరువలో కేసులు - corona virus news worldwide

కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 4.35 లక్షల మంది మృతి చెందారు.

world tracker
కరోనా

By

Published : Jun 15, 2020, 6:59 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 79,82,948 కేసులు నమోదయ్యాయి. 4,35,168 మంది మృత్యువాత పడ్డారు.

అమెరికాలో మళ్లీ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజులో 19,920 కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో మొత్తం కేసులు 21,62,144 కు చేరుకున్నాయి. కరోనా బారిన పడి 1,17,853 మంది మృతిచెందారు.

దక్షిణ అమెరికా దేశాల్లో..

దక్షిణ అమెరికా దేశాల్లో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. బ్రెజిల్​లోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,086 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 867,882కు చేరుకుంది. తాజాగా 598 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 43,389కు పెరిగింది.

పెరులో ఒక్కరోజులో 4 వేల కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 2.2 లక్షలకు చేరుకున్నాయి. చిలీలో గడిచిన 24 గంటల్లో 6 వేలకుపైగా కేసులు పెరిగాయి. మొత్తం సంఖ్య 1.74 లక్షలకు చేరింది.

రష్యాలో..

రష్యాలోనూ కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 5.28 లక్షలకు చేరుకోగా కరోనా బారిన పడి 6,948 మంది మృతిచెందారు.

దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్​, పాకిస్థాన్​, బంగ్లాదేశ్, కంబోడియాల్లోనూ కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి.

ఇదీ చూడండి:'దిల్లీలోని వైరస్ బాధితుల కోసం 20వేల పడకలు'

ABOUT THE AUTHOR

...view details