సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. పొగతాగే వారి ఊపిరితిత్తులు వైరస్‌పై ఉండే ప్రొటీన్ రిసెప్టార్ (కొమ్ము వంటి నిర్మాణం)లను అధికంగా ఆకర్షించే అవకాశం ఉందని తేలింది. ఈ అలవాటును మానుకోవటం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారి నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.
అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. పొగతాగేవారిలో కరోనా ప్రభావం అధికంగా ఉండటానికి గల కారణాలను 'డెవలప్మెంటల్ సెల్' జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో వివరించారు.
"మానవ కణాల్లోకి ప్రవేశించడానికి ఏసీఈ-2 అనే ప్రొటీన్‌ను కరోనా వైరస్ ఉపయోగించుకుంటుంది. సాధారణ వ్యక్తులతో పోల్చితే పొగ తాడటం వల్ల ఏసీఈ-2 పెరుగుదల 30 నుంచి 55 శాతం అధికంగా ఉంటుందని మేం గుర్తించాం. అయితే ఈ పెరుగుదల తాత్కాలికమే. ధూమపానాన్ని వదిలేసిన వారిలో వీటి పెరుగుదల సాధారణంగానే ఉంది."