తెలంగాణ

telangana

ETV Bharat / international

'క్వాడ్ కూటమిని అందరూ ఇష్టపడుతున్నారు' - quad summit goes well joe biden

క్వాడ్ కూటమి సమావేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. భేటీ చాలా బాగా జరిగిందని తెలిపారు. కూటమిని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నట్లు అనిపించిందన్నారు.

Quad summit went very well, says President Biden
'క్వాడ్ కూటమిని అందరూ ఇష్టపడుతున్నారు'

By

Published : Mar 15, 2021, 7:30 AM IST

క్వాడ్ దేశాధినేతలతో కూడిన తొలి శిఖరాగ్ర సమావేశం చాలా బాగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కూటమిని ఇష్టపడుతున్నట్లు అనిపించిందని అన్నారు. ఈ భేటీ పూర్తయిన తర్వాత క్వాడ్ సమావేశం గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​లతో కూడిన ఈ క్వాడ్ కూటమి సదస్సు శుక్రవారం జరిగింది. 2007లో ఈ కూటమి ఏర్పాటు కాగా.. తొలిసారి దేశాధినేతల స్థాయిలో చర్చలు జరిగాయి.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సమానత్వం కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ భేటీలో నేతలంతా ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై అందరికీ హక్కుందని ఉద్ఘాటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా రకరకాల యత్నాలు, దుందుడుకు వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details