బిన్ లాడెన్ కొడుకు, అల్‌ఖైదా వారసత్వ అధినేత హమ్జా బిన్ లాడెన్ మరణించినట్లు అమెరికా మీడియా సంస్థలు తెలిపాయి. ఇదే విషయాన్ని అగ్రరాజ్యానికి చెందిన కొందరు అధికారులు ధ్రువీకరించినట్టు ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. అయితే హమ్జా మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ఈ విషయంపై స్పందించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు.
అగ్రరాజ్య ప్రమేయమున్న ఆపరేషన్‌లో భాగంగా గత రెండేళ్లలో ఏదో ఒక సమయంలో హమ్జా మరణించాడని అధికారులు తెలిపినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.