తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 12:48 PM IST

ETV Bharat / international

'భారత్​ భేష్... చైనా ఓ బందిపోటు ముఠా'

సరిహద్దు ఘర్షణలో చైనాను సమర్థంగా నిలువరించిన భారత్​ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అమెరికన్ సెనేటర్ జాన్ కెన్నడీ ప్రశంసించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ బందిపోటు ముఠాలా కాకుండా.. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆయన హితవు పలికారు.

Proud of India for standing up to Chinese aggression: US Senator
భారత్​ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: కెన్నడీ

చైనా దురాక్రమణను సమర్థంగా అడ్డుకున్న భారత్​ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అమెరికన్ సెనేటర్ జాన్​ కెన్నడీ ప్రశంసలు కురిపించారు. ఇతర దేశాలు చైనా విస్తరణవాదాన్ని నిర్భయంగా ఎదుర్కొనేందుకు, ఇది ప్రేరణ కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.

"చైనా దురాక్రమణను భారత ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా అడ్డుకున్నారు. ఇది చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే కెనడా విషయంలోనూ నేను గర్వపడుతున్నాను. దీని ప్రకారం మనకు అర్థమయ్యేది ఏమిటంటే... చైనాను చూసి ప్రతి దేశమూ భయపడి, పారిపోయి, ఓ మూల దాక్కోదు."

- జాన్ కెన్నడీ, రిపబ్లికన్ సెనేటర్

'చైనా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలని... అమెరికా సహా ప్రపంచదేశాలు ఆశిస్తున్నాయి. ఈ విషయాన్ని కమ్యునిస్టు పార్టీ అర్థం చేసుకోవాలి' అని కెన్నడీ పేర్కొన్నారు.

భయం ఫుల్​.. విశ్వాసం నిల్​

"అమెరికాను పక్కన పెడితే... చైనాను ఏ దేశమైనా విశ్వసిస్తోందా? లేదు. ఒక్క దేశం కూడా చైనా విశ్వసించడంలేదు. కానీ అవన్నీ చైనాను చూసి భయపడుతున్నాయి. ఎందుకంటే అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. డ్రాగన్ తన ఆర్థిక బలంతో మిగతా దేశాలను బెదిరిస్తోంది. ఆ భయంతోనే చాలా దేశాలు చైనాను ఎదిరించడానికి భయపడుతున్నాయి."

- జాన్ కెన్నడీ, రిపబ్లికన్ సెనేటర్

ఎదిరించే దమ్ముంది..

చైనా దురాక్రమణను ఎదిరించే దమ్మున్న దేశాలు కూడా ఉన్నాయని లూసియానా సెనేటర్​ జాన్ కెన్నడీ పేర్కొన్నారు.

"భారత్​, ఆస్ట్రేలియా, కెనడా... చైనా దురాక్రమణను ఎదిరిస్తున్నాయి. డ్రాగన్​ను ఎదిరించేందుకు ఐరోపా సహా మిత్రదేశాలన్నీ కలిసి రావాలి. చైనా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే... వ్యాపార సంబంధాలను తెంచుకుంటామని తెగేసి చెప్పాలి. అప్పుడే చైనాకు జ్ఞానోదయం అవుతుంది."

- జాన్ కెన్నడీ, రిపబ్లికన్ సెనేటర్

బందిపోటు ముఠా

చైనా కమ్యూనిస్టు పార్టీ బందిపోటు ముఠాలా ప్రవర్తిస్తోందని కెన్నడీ ఘాటు విమర్శలు చేశారు. చైనా ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

"చైనా... ఇతరుల మేధో సంపత్తిని దొంగలించడం, మోసం చేయడం, దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాలను ఆక్రమించుకోవడం, ఆస్ట్రేలియాను బెదిరించడం మానుకోవాలి."

- జాన్ కెన్నడీ, రిపబ్లికన్ సెనేటర్

ఇదీ చూడండి:నేపాల్​ స్టాండింగ్ కమిటీ సమావేశం మళ్లీ వాయిదా

ABOUT THE AUTHOR

...view details