తెలంగాణ

telangana

ETV Bharat / international

అగ్రరాజ్యాన్ని ఇలా ఎప్పుడైనా ఊహించుకున్నారా? - అమెరికాలో హింస

అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. జార్జ్​ ఫ్లాయిడ్​ మృతితో చెలరేగిన ఆగ్రహజ్వాలలు అమెరికా మొత్తం వ్యాపించాయి. న్యూయార్క్​ నుంచి లాస్​ ఏంజెల్స్​ వరకు ఆందోళనలు మిన్నంటాయి. పోలీసు వాహనాలకు నిప్పంటించారు నిరసనకారులు. కొంతమంది అధికారులకు గాయాలయ్యాయి.

US cities
అగ్రరాజ్యంలో ఆగ్రహజ్వాలలు- మిన్నంటిన ఆందోళనలు

By

Published : May 31, 2020, 5:29 PM IST

Updated : May 31, 2020, 7:09 PM IST

అగ్రరాజ్యాన్ని ఇలా ఎప్పుడైనా ఊహించుకున్నారా?

జార్జ్​ ఫ్లాయిడ్​... అనే నల్లజాతి అమెరికన్ మరణంతో మొదలైన ఆందోళనలు తారస్థాయికి చేరాయి. వేలమంది నల్లజాతీయులు అమెరికా వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఎక్కడ చూసినా విరిగిన కిటికీలు, తగలబడుతున్న భవనాలు, కొల్లగొట్టిన దుకాణాలే దర్శనమిస్తున్నాయి.

అగ్రరాజ్యంలో ఆగ్రహజ్వాలలు
  • అగ్రరాజ్యంలో దాదాపు 12 నగరాల్లో నిరసనలు మిన్నంటాయి.
    మిన్నంటిన ఆందోళనలు
  • పోలీసుల చేతిలో ఏళ్ల తరబడి ఆఫ్రికన్​ అమెరికన్లు నలిగిపోతున్నారని.. 'ఇక వివక్షను సహించబోం', 'వీటితో విసిగిపోయాం' అంటూ నినదించారు నల్లజాతీయులు.
    పోలీసు వాహనానికి నిప్పు
  • భవనాలు, గోడలపై ఎక్కడ చూసినా 'ఐ కాంట్​ బ్రీత్' (నేను ఊపిరితీసుకోలేపోతున్నాను) అనే మాటలే కనిపిస్తున్నాయి.
    నిరసకారులు పోలీసుల మధ్య ఘర్షణ
  • శ్వేతసౌధం దగ్గర్లో ఓ చెత్తకుండీకి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. కొంతమంది శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు.
    నిరసకారులు పోలీసుల మధ్య ఘర్షణ
  • వాషింగ్టన్​లో పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. పోలీసులపై బాటిళ్లు విసిరారు. దుకాణాల కిటికీలను ధ్వంసం చేశారు. స్టోర్​లో టీవీలు సహా కొన్ని వస్తువులను లూఠీ చేశారు.
    పోలీసు వాహనానికి నిప్పు
  • మినియాపొలిస్‌లో రాత్రి 8 తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఆందోళనకారులు లెక్కచేయలేదు.
    ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు
  • నిరసనకారులపై బాష్పవాయువు, రబ్బర్​ తూటాలను ప్రయోగించి చెదరగొట్టారు నేషనల్​ గార్డ్స్​, పోలీసులు, స్టేట్​ ట్రూపర్లు.
    పోలీసు బలగాల మోహరింపు
  • ఫిలడెల్ఫియాలో కనీసం నాలుగు పోలీసులు వాహనాలకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. 13 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
    ఘర్ణణ వాతావరణం
  • 22 నగరాల్లో దాదాపు 1,669 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇందులో మూడొంతుల మందిని లాస్​ ఎంజెల్స్​లోనే అదుపులోకి తీసుకున్నారు.
    నిరసకారులను అడ్డుకుంటూ
  • లాస్​ ఏంజెల్స్​ గవర్నర్​ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాదాపు 10 వేలమంది నేషనల్​ గార్డ్స్​ నగరంలో గస్తీ కాస్తున్నారు.
    బాష్పవాయువు ప్రయోగం
  • లాస్‌ ఏంజెల్స్‌, డెన్వెర్‌, మియామీ, అట్లాంటా, షికాగో, లూసివిల్లే, మినియాపొలిస్‌ వంటి దాదాపు 12కు పైగా నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు.
    నిరసనకారుడ్ని అదుపులోకి తీసుకుని
  • లాస్​ ఏంజెల్స్​లో చెలరేగిన హింస, విధ్వంసాన్ని 1992 అల్లర్లతో పోల్చుతున్నారు. ఆ సమయంలో 1 బిలియన్​ డాలర్లకుపైగా నష్టం వాటిల్లింది.
    నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • అందోళనకారులను దుండగులుగా అభివర్ణిస్తూ ట్రంప్‌ చేసిన ట్వీట్‌తో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. 'నేషనల్​ గార్డ్స్​ రంగంలోకి దిగారు.. ఇక ఆటలు సాగవు' అని ట్రంప్​ ట్వీట్​ చేశారు.
    కాలిపోతున్న వాహనం
    పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ
    రంగంలోకి నేషనల్ గార్డ్స్
    పోలీసుల గస్తీ
Last Updated : May 31, 2020, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details