తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో నల్లజాతీయురాలిపై కాల్పులు - పోలీసుల కాల్పులపై అమెరికాలో వివాదం

అమెరికాలో ఓ నల్లజాతీయురాలిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ నల్లజాతీయులు మళ్లీ ఆందోళనలు చేపడుతున్నారు.

america police, black women
పోలీసుల కాల్పులు, నల్లజాతీయురాలిపై కాల్పులు

By

Published : Apr 22, 2021, 10:42 AM IST

Updated : Apr 22, 2021, 12:05 PM IST

నల్లజాతీయురాలిపై పోలీసుల కాల్పులు

అమెరికాలో తీవ్ర దుమారం రేపిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసు తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. మరో నల్లజాతీయురాలిపై జరిగిన పోలీసు కాల్పుల ఘటనపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కాల్పుల ఘటనను నిరసిస్తూ నల్లజాతీయులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. మృతురాలిని 16 ఏళ్ల మఖియా బ్రయంట్‌గా గుర్తించారు. ఈ ఘటన ఓహియో రాష్ట్రంలో జరిగింది.

ఓ యువతి కత్తితో బెదిరింపులకు పాల్పడుతోందన్న సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సదరు యువతి కత్తితో ఓ మహిళపై దాడికి చేయగా ఆమె వెనక్కిపడిపోయింది. ఆ తర్వాత మరొకరిపై దాడికి యత్నించటంతో పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. చివరి ప్రయత్నంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దర్యాప్తునకు ఆదేశించిన పోలీసు శాఖ సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేసింది.

ఇదీ చదవండి:భారత్​లో ఒక్కరోజే 3 లక్షలు దాటిన కరోనా కేసులు

Last Updated : Apr 22, 2021, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details