అమెరికాలో మినియాపొలిస్తో పాటు ఆ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. ఓ ఆఫ్రికన్ అమెరికన్ పట్ల డెరెక్ చావిన్ అనే మాజీ పోలీసు అధికారి కర్కశంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. సదరు ఆఫ్రికన్ వ్యక్తి కస్టడీలోనే చనిపోయిన నేపథ్యంలో.. డెరెక్ ఇంటి పరిసరాలకు చేరుకున్న నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారీ సంఖ్యలో గుమిగూడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఇదే అదనుగా కొంత మంది చుట్టుపక్కల షాపులను ధ్వంసం చేస్తూ.. దొంగతనానికి పాల్పడుతున్నారు.
ఇదీ జరిగింది
ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం రాత్రి జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఆఫ్రికన్ అమెరికన్ కనిపించాడు. కారు నుంచి వెలుపలికి రావాల్సిందిగా ఆదేశించారు. బయటకు రాగానే జార్జ్‌ను నేలపైకి పడగొట్టారు. సంకెళ్లు వేశారు. ఈ క్రమంలో జార్జ్ మెడపై పోలీసు అధికారి ఒకరు మోకాలు బలంగా ఆనించాడు.