తెలంగాణ

telangana

ETV Bharat / international

చిలీలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రం

దక్షిణ అమెరికాలోని చిలీలో నిరసనకారులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. రెస్టారెంట్లు, భవనాలకు నిప్పంటించారు. 10 రోజులుగా జరుగుతున్న ఈ హింసాత్మక చర్యల్లో 20 మంది మరణించారు.

చిలీ: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తం

By

Published : Oct 29, 2019, 3:04 PM IST

చిలీ: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తం

దక్షిణ అమెరికా చిలీలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాది మంది నిరసనకారులు రోడ్లమీదకు వచ్చి అధ్యక్షుడు పినెరాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. కొంతమంది బృందంగా ఏర్పడి ఫాస్ట్​ఫుడ్​ రెస్టారెంట్లు, భవనాలకు నిప్పంటించారు. సామాజిక పథకాల అమల్లో లోపాలు, అధిక జీవన వ్యయంపై దృష్టి సారించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

10 రోజుల హింసాకాండలో 20 మంది బలి

ప్రదర్శనలు చేపట్టి 10 రోజులు కావస్తున్నా చిలీ ప్రభుత్వం ఇప్పటివరకు నిరసనకారులకు అనుకూలంగా.. ఎటువంటి హామీలు ప్రకటించలేదు. ఈ హింసాత్మక చర్యల్లో 20 మంది మరణించారు.

ఇదీ చూడండి: దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం

ABOUT THE AUTHOR

...view details