తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది' - trump still involving in lawsuits

ఎలక్టోరల్​ కాలేజీలో ఆధిక్యం లభించినప్పటికీ జో బైడెన్ ఎన్నికను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించనట్లే కనిపిస్తోంది. ఎలక్టోరల్ ఎన్నిక రాజ్యాంగ ప్రక్రియలో ఓ భాగమేనని, ట్రంప్ న్యాయపరమైన పోరాటం మాత్రం కొనసాగుతోందని శ్వేతసౌధం వెల్లడించింది.

president trump is still involved in ongoing election litigation Kayleigh McEnany
'ట్రంప్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది'

By

Published : Dec 16, 2020, 5:32 AM IST

ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికలో జో బైడెన్ విజయం సాధించడం రాజ్యాంగ ప్రక్రియలో ఓ ముందడుగు మాత్రమేనని శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ కైలీ మెక్​ఎనానీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతోందని చెప్పారు. బైడెన్ గెలుపును అంగీకరించి శ్వేతసౌధంలోకి ఆహ్వానిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పారు.

"ఎన్నికలకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులపై ట్రంప్ ఇప్పటికీ పోరాడుతున్నారు. నిన్న జరిగింది రాజ్యాంగపరమైన ప్రక్రియలో ఓ భాగం మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని ఆయన(ట్రంప్)కే వదిలేయాలని అనుకుంటున్నా."

-కైలీ మెక్​ఎనానీ, శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ

నిజానికి ట్రంప్ న్యాయపోరాటం ఇదివరకే ముగిసిపోయింది. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్​ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో న్యాయపరంగా ఆయనకు అన్నిదారులు మూసుకుపోయాయి.

టీకా స్వీకరించేందుకు ట్రంప్ సిద్ధమే

మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి వచ్చిన అభినందన సందేశానికి ట్రంప్ ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు మెక్​ఎనానీ. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ట్రంప్ సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేంత వరకు ఆగాల్సి ఉందన్నారు. టీకా విషయంలో ఫ్రంట్​లైన్ వర్కర్లు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికే తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో టీకాపై విశ్వాసం కలిగించేందుకు శ్వేతసౌధ అధికారులు వ్యాక్సిన్ స్వీకరిస్తారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details