అధికార బదలాయింపునకు మొండిగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించనని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి జో బైడెన్‌పై తాను గెలిచానని ప్రకటించారు.
వీటిని రిగ్గింగ్ ఎన్నికలుగా అభివర్ణించిన ట్రంప్.. ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీడియా నకిలీ కథనాల్లోనే బైడెన్ గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు. దీన్ని తాను అంగీకరించనని ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై ప్రయాణం ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు.
రీకౌంటింగ్పైనా..
జార్జియాలో కొనసాగుతున్న రీకౌంటింగ్ ప్రక్రియపైనా ట్రంప్ ఆరోపణలు చేశారు. అక్కడ నకిలీ రీకౌంటింగ్ సాగుతోందని అన్నారు. ఓట్లపై సంతకాల పరిశీలన, ధ్రువీకరణ జరగట్లేదని తెలిపారు.