భారత్కు అమెరికా గణనీయమైన సహకారం అందిస్తోందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న భారత్కు వైద్య పరికరాలు, ఔషధాలు, ఆక్సిజన్, టీకాలు పంపిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తాను మాట్లాడినట్లు చెప్పారు.
"భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేను మాట్లాడాను. ఆ దేశానికి అత్యవసరంగా కావాల్సిన వాటి గురించి అడిగాను. టీకాలు తయారు చేసుకునేందుకు పదార్థాలు కావాలని ఆయన చెప్పారు. వాటిని పంపిస్తున్నాం. ఆక్సిజన్ పంపిస్తున్నాం. ఇతర పరికరాలనూ చేరవేస్తున్నాం. భారత్ కోసం మేం చాలా చేస్తున్నాం."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు