హెచ్-1బీ సహా దీర్ఘకాల వలసదారులపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ 'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' సమస్యపై బైడెన్ చర్చించనున్నట్టు శ్వేతసౌధం ప్రకటించింది.
అమెరికాలో దీర్ఘకాలంగా వలసదారుల వీసాతో నివాసముంటున్న వారిపై ఆధారపడుతున్న పిల్లలను 'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' అని అంటారు. అమెరికా చట్టాల ప్రకారం.. పిల్లలు 21ఏళ్లు దాటిన అనంతరం.. వారిని డిపెండెంట్లుగా పరిగణించకూడదు. ఫలితంగా తాము తిరిగి వెళ్లిపోవాలేమోనని అనేకమంది ప్రవాస భారతీయుల పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.