తెలంగాణ

telangana

ETV Bharat / international

పుతిన్​తో చర్చలకు బైడెన్​ సిద్ధం: అమెరికా

Ukraine crisis: ఉక్రెయిన్​తో రష్యా యుద్ధాన్ని నివారించేందుకు పుతిన్​తో బైడెన్​ చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. రానున్న రోజుల్లో రష్యా దాడి చేయకుండా ఉంటే తాను కూడా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్​ను కలవనున్నట్లు చెప్పారు.

Ukraine crisis
Vladimir Putin

By

Published : Feb 21, 2022, 5:50 AM IST

Ukraine crisis: ఉక్రెయిన్​పై యుద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే నిర్ణయం తీసకున్నారని తెలిపారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. అందుకోసం దౌత్యపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

"ఏ సమయంలోనైనా.. ఏ రూపంలోనైనా పుతిన్​తో చర్చించడానికి అధ్యక్షుడు బైడెన్ సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో రష్యా దాడి చేయకుండా ఉంటే వచ్చే వారం నేను కూడా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్​ను కలవనున్నారు. యుద్ధం నివారించడానికే మా ప్రయత్నమంతా" అని బ్లింకెన్​ చెప్పారు.

రష్యా.. వెనక్కి తగ్గేదేలే

ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణ విషయంలో రష్యా మాట మార్చింది. సైనిక విన్యాసాల్లో భాగంగా పంపిన దళాలు తిరిగి తమ స్థావరాలకు చేరుతాయని నిన్న మొన్నటివరకు చెబుతూ వచ్చిన మాస్కో ఇప్పుడు వెనక్కి తగ్గేదేలేదు.. అంటోంది. విన్యాసాల్లో భాగంగా బెలారస్‌కు పంపిన దళాలు మరి కొన్ని రోజులు ఆ దేశంలోనే తిష్ఠ వేయనున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం బెలారస్‌ రక్షణ మంత్రి తెలిపారు. రష్యాతో కలిసి తమ దళాలు సాగిస్తున్న సైనిక విన్యాసాలను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

రష్యా దళాలు

నిజానికి ఈ విన్యాసాలు ఆదివారంతో ముగియాల్సి ఉంది. అయితే తూర్పు ఉక్రెయిన్‌లో తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సాకుతో వీటిని పొడిగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

యుద్ధం అంచున ఐరోపా..

ఐరోపా యుద్ధం అంచున ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆదివారం వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలుగా రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని అభివర్ణించారు.

ప్రతిదాడులు చేయడం లేదు..

తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. భారీ బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. రష్యా అనుకూల తిరుగుబాటు దళాలు ఫిరంగులతో తమపై విరుచుకుపడుతున్నాయని, తాము మాత్రం ప్రతిదాడులు చేయడం లేదని ఉక్రెయిన్‌ సైన్యం చెబుతోంది. మరోవైపు తమ ఆధీనంలోని ప్రాంతాల్లోని పౌరులను రష్యాకు తరలించే ప్రక్రియను తిరుగుబాటు నేతలు ముమ్మరం చేశారు. 7 లక్షల మంది రష్యాకు వెళ్లేందుకు వీలుగా పాస్‌పోర్టులను జారీ చేశారు.

ఇదీ చూడండి:ఫిరంగి దాడులు.. అణు విన్యాసాలు.. ఏ క్షణంలోనైనా యుద్ధం!

ABOUT THE AUTHOR

...view details