తెలంగాణ

telangana

ETV Bharat / international

'గర్భిణీలపైనా వాక్సిన్​ ట్రయల్స్ జరపండి' - గర్భిణీలపై కరోనా వ్యాక్సిన్

అత్యవసరంగా గర్భిణీలపై కరోనా వాక్సిన్స్​ ట్రయల్స్ చేయాలని లాన్సెట్​ పరిశోధన తెలిపింది. దానివల్ల వారికి మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కరోనా సోకిన 8 వేలమందికిపైగా గర్భిణీలపై సర్వే చేసింది.

Pregnant women should be included in COVID-19 clinical trials, says study
అత్యవసరంగా గర్భిణీలపై కరోనా వాక్సిన్​ ట్రయల్స్ చేయండి

By

Published : Dec 19, 2020, 11:34 AM IST

గర్భిణీలపైనా కొవిడ్​ వ్యాక్సిన్ ట్రయల్స్ చేయాలని లాన్సెట్​ పరిశోధన తేల్చింది. దాని వల్ల వారికి మెరుగైన వైద్యసేవలను అందించవచ్చని అభిప్రాయపడింది.

కొవిడ్​ చికిత్సకు వాడే రెమిడెసివిర్​, హైడ్రాక్సీ క్లోరోక్విన్​, కార్టికో స్టెరాయిడ్స్ తదితర మందులను గర్భిణీలకు ఇవ్వడం లేదు. అయితే కరోనా వాక్సిన్ ట్రయల్స్ నుంచి దూరంగా గర్భణీలను దూరంగా ఉంచడం సరికాదని తెలిపింది. దాని వల్ల నష్టమే ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. వ్యాక్సిన్​ ట్రయల్స్​లో వారిని భాగస్వాములను చేయడమే మంచిదని స్పష్టం చేసింది.

8 వేలమందిపై..

అమెరికాలో కరోనా సోకిన 8,207 మంది గర్భిణీలపై లాన్సెట్​ ఈ సర్వే చేసింది. అందులో.. చాలా మందికి అత్యవసరవైద్యం కావాలని తేలింది. ఫలితంగా.. గర్భిణీలపైనా కరోనా ట్రయల్స్ చేస్తే మెరుగైన ఫలితాలుంటాయని అభిప్రాయపడింది.

గర్భిణీలపై క్లినికల్​ ట్రయల్స్ ఎందుకు చేయట్లేదో కారణాలు తెలవలేదని పేర్కొంది. బహుశా పిండానికేమన్నా ఇబ్బంది తలెత్తుందేమోనని భయపడి ఉండొచ్చని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:'కొవిడ్​తో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం ఇదే మొదటిసారి'

ABOUT THE AUTHOR

...view details