తెలంగాణ

telangana

ETV Bharat / international

టెక్సాస్​లో పవర్​ కట్- విమానాలు బంద్

మంచు తుపాను కారణంగా అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా... వందల విమానాలు రద్దయ్యాయి.

texas, power cut
మంచు తుపానుకు స్తంభించిన టెక్సాస్​

By

Published : Feb 15, 2021, 6:17 PM IST

మంచు తుపాను ధాటికి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. టెక్సాస్​ రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా మారింది. వణికించే చలి, ఎడతెరిపి లేని హిమపాతానికి తోడు విద్యుత్​ సరఫరా నిలిపివేత, విమానాల రద్దు, ట్రాఫిక్ జామ్​ కారణంగా అక్కడి ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య అధికారులు రోజులో అత్యధిక సమయం విద్యుత్​ సరఫరా నిలిపివేస్తున్నారు. ఫలితంగా వేలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

అధ్యక్షుడి ఆదేశాలు..

తుపాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సుమారు 120 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. సోమవారం 12 అంగుళాల వరకు మంచు కురవడం సహా తుపాను తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధ్యక్షుడు జో బైడెన్ రాష్ట్రంలో తుపానును ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందించాలని ఆదేశిస్తూ హోంశాఖకు ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి :బైడెన్​ బృందంలో మరో ఇద్దరు భారతీయ-అమెరికన్లు!

ABOUT THE AUTHOR

...view details