కరోనాపై పోరులో మరో అడుగు ముందుకేశారు పరిశోధకులు. కొవిడ్-19 యాంటీవైరల్ చికిత్స కోసం ఏ కణాన్ని లక్ష్యంగా చేసుకోవాలన్న అంశంపై ఓ అంచనాకు వచ్చారు. కరోనా వైరస్ హోస్ట్ కణాల్లోకి ప్రవేశించే తీరు, ఇతర వైరస్లలో ఈ ప్రక్రియ జరిగే విధానాన్ని పరిశీలించడం ద్వారా ఈ విషయం కనుగొన్నారు అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. తమ విశ్లేషణ నిజమని తేలితే... కరోనాకు చికిత్స చేయడం సులభతరమవుతుందని భావిస్తున్నారు.
కార్నెల్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనానికి సంబంధించిన కథనం 'యాంటీ వైరల్ రీసెర్చ్' పత్రికలో ప్రచురితమైంది.
కణాల్లోకి వైరస్ ప్రవేశిస్తుందిలా..
"వైరస్ వ్యాప్తి చేసేందుకు సరైన కణాన్ని గుర్తించడం ద్వారా 'పొర సంలీనం' అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం హోస్ట్ కణాల నుంచి సమాచారాన్ని సేకరించి.. కణాల ఉపరితలాలపై వైరస్ దాడి చేస్తుంది.