పెరూలో బంగాళ దుంప పదో వార్షికోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రైతులు, వ్యాపారులూ పాల్గొన్నారు.
తెలుపు, పసుపు, గులాబీ, ఊదారంగు బంగాళ దుంపలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఆలుగడ్డల సాగుకు పెరూ ప్రసిద్ధి. అక్కడి రైతులు దాదాపు 3,500 రకాల బంగాళ దుంపలను సాగు చేస్తారు. 30 లక్షల మంది రైతులకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. ఎక్కువగా ఆలూతో చేసిన వంటకాలనే తింటారు పెరూ ప్రజలు.
పెరూలో 2018లో ఆలుగడ్డ ఉత్పత్తి 5.1 మిలియన్ టన్నులకు చేరింది. ఇందులో 90 శాతం ఆ దేశంలోనే అమ్ముడవుతుంది.