సామాజిక మాధ్యమాల్లో వందలాది కుకింగ్ ఛానెల్స్ ఉన్నాయి. వీటికి ఆదరణ ఎక్కువే! అందుకు తగ్గట్టుగానే.. ప్రేక్షకులను తమవైపు తిప్పుకునేందుకు రకరకాల వంటలను ప్రయోగిస్తూ ఉంటారు ఆ ఛానెల్ నిర్వహకులు. అందులో కొన్ని క్లిక్ అయ్యి విశేష ఆదరణ పొందితే.. మరికొన్ని బెడిసి కొట్టి ట్రోల్స్‌కు గురవుతాయి. తాజాగా.. అమెరికాకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ ఆ డిష్ ఏంటి అని అనుకుంటున్నారా? అదే.. 'పాప్‌కార్న్ సలాడ్'.
పాప్‌కార్న్‌తో..
వినడానికే వింతగా ఉన్న ఈ పాప్‌కార్న్ సలాడ్ సృష్టికర్త మోలీ యేహ్. తన బ్లాగ్‌లో దీనికి సంబంధించిన వీడియోను అప్లోడ్ చేసింది. దానికి 'క్రంచీ స్నాప్ పీ పాప్‌కార్న్ సలాడ్' అని పేరు పెట్టింది. పేరుకు తగ్గట్టుగానే డిష్ అంతా పాప్‌కార్న్‌తో నిండిపోతుంది. దానిలో క్యారెట్, బఠాణీ, మయోనీస్, వెనిగర్, పంచదార తదితర వాటిల్ని వేసి బాగా కలిపింది.
వీడియో ఆద్యంతం.. వంటను ఎంజాయ్ చేస్తూ కనిపించింది మోలీ. తన వంటను తానే తిని ఆహా! అని కామెంట్లు విసిరింది. 'ఎక్కువ పాప్‌కార్న్ చేసుకుంటే.. వాటిని తింటూ సలాడ్ చేసుకోవచ్చు' అని సలహా కూడా ఇచ్చింది.