భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గొప్ప దౌత్యవేత్త అని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో కొనియాడారు. భారత్-అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి జయశంకర్ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. జయశంకర్ కనబరచిన దౌత్య చతురత వల్లనే భారత్-అమెరికాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడ్డాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదే ట్వీట్లో జయశంకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జయశంకర్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. జనవరి 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి జో బైడన్ సిద్ధమవుతుండగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'అమెరికా-భారత్ సంబంధాలు బలపడడానికి ఆయనే కారణం' - భారత విదేశాంగ మంత్రిని కొనియాడిన మైక్ పాంపియో
భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ దౌత్య చతురత వల్ల అమెరికా, భారత్ మధ్య సంబంధాలు బలపడ్డాయని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. జయశంకర్ దౌత్యవేత్తే కాకుండా గొప్ప నాయకుడని కొనియాడారు.

'అమెరికా-భారత్ సంబంధాలు బలపడడానికి ఆయనే కారణం'
'హౌడీ మోదీ' హ్యష్ ట్యాగ్ ను ట్విట్టర్లో పంచుకొని, 2019లో మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన ఆ సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా 'మోదీ హైతో ముక్తిన్ హై' హ్యాష్‌ట్యాగ్‌ని పోస్టు చేశారు. కాగా ఇరు దేశాల మధ్య ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం కోసం ఇరువురు విదేశాంగ మంత్రులు తరుచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ.. ఉంటారు.
ఇదీ చూడండి:అమెరికాకు భారత్ విలువైన భాగస్వామి: పాంపియో
TAGGED:
Pompeo praises Jaishankar