అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎదుర్కొన్న విధంగానే చైనాపై బైడెన్ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని సూచించారు.
"చైనీయులను అమెరికా స్వాగతించినందుకు గత 50 ఏళ్లగా ఎన్నో ఉద్యోగాలను, ఆధునిక పరిజ్ఞానాన్ని వారు మన నుంచి దొంగిలించారు. మన పరిశోధన సంస్థల్లోకి చొరబడ్డారు. ఇదంతా రిపబ్లికన్, డెమోక్రాట్ల పాలనలోనే జరిగింది. డ్రాగన్ దుశ్చర్యలపై మేం కఠిన చర్యలు చేపట్టాం. బైడెన్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరితో కొనసాగాలి."