అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden news).. దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
జిల్ బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ "చీకటిలో నుంచి సత్యం, జ్ఞానాన్ని వెతుక్కోవచ్చనే విషయాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకొంటున్న హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులకు శుభాకాంక్షలు."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
కమలా హ్యారిస్ విషెస్..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(kamala harris news) దీపావళి విషెస్ తెలిపారు. వెలుగుల పండగ జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు కమల. కరోనా మహమ్మారి మధ్యలో పండగ జరుపుకుంటున్నామన్నారు. అత్యంత పవిత్రమైన విలువలను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని ట్వీట్లో తెలిపారు కమలా.
బోరిస్ శుభాకాంక్షలు..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris johnson news).. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ దీపావళి మనందరికీ ప్రత్యేకంగా నిలుస్తోంది. కఠినమైన సమయాన్ని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాం. గతేడాది నవంబర్‌తో పోలిస్తే చాలా ముందుకు వచ్చాం' అంటూ ట్వీట్ చేశారు. కుటుంబం, స్నేహితులతో ఈ సంతోష సమయాన్ని గడపాలని బోరిస్ అన్నారు.
వీరితో పాటు శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స, శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మరికొందరు దేశాధినేతలు, ప్రముఖులు.. భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు