తెలంగాణ

telangana

ETV Bharat / international

టెక్సాస్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి - అమెరికా షాపింగ్​ మాల్​లో కాల్పులు

అమెరికా టెక్సాస్​లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చికాగోలోని మెక్​డొనాల్డ్​ ఫాస్ట్​పుడ్​ సెంటర్​లో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఏడేళ్ల బాలిక చనిపోయింది.

fatal shooting, gun
టెక్సాస్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి

By

Published : Apr 19, 2021, 5:08 AM IST

Updated : Apr 19, 2021, 9:50 AM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఓ షాపింగ్‌ మాల్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్‌ వద్ద చోటుచేసుకుంది.

అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదు. అతడి కోసం గాలిస్తున్నారు. ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలోని ఇళ్లనుంచి ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరించారు.

చికాగోలోనూ..

చికాగోలోని మెక్​డొనాల్డ్​ పాస్ట్​ఫుడ్​ సెంటర్​​ బయట జరిగిన కాల్పుల్లో ఓ ఏడేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు కారును పార్క్​ చేస్తుండగా.. మరో కారుపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.

బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆమె తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:పాక్​లో టీఎల్​పీ కార్యకర్తల బీభత్సం.. డీఎస్పీ కిడ్నాప్​

Last Updated : Apr 19, 2021, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details