తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫుట్​బాల్​ మ్యాచ్​ చూస్తుండగా కాల్పులు- నలుగురు మృతి

అమెరికా కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో దుండగులు కిరాతక చర్యకు ఒడిగట్టారు. ఓ ఇంట్లో ఫుట్​బాల్​ మ్యాచ్ వీక్షిస్తున్న స్నేహితులు, కుటుంబ సభ్యులపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు.

ఫుట్​బాల్​ మ్యాచ్​ చూస్తుండగా కాల్పులు- నలుగురు మృతి

By

Published : Nov 18, 2019, 1:14 PM IST

అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరో నలుగురిని బలిగొంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఒక దగ్గరికి చేరిన స్నేహితులు, కుటుంబ సభ్యులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన మిగతా ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. నిందితులు కాలినడకన వచ్చి కాల్పులు జరిపారని... బాధితులు వారిని గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: బిడెన్​పై ఉత్తరకొరియా అనుచిత వ్యాఖ్యలు.. ట్రంప్​ వ్యంగ్యం

ABOUT THE AUTHOR

...view details