తెలంగాణ

telangana

ETV Bharat / international

నడిరోడ్డుపై దుండగుల కాల్పులు.. ఇద్దరు మృతి! - Charlotte shooting

అమెరికాలో నడిరోడ్డుపై దుండగుల కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Police say 2 dead, 7 wounded in North Carolina shooting
నడిరోడ్డుపై దుండగుల కాల్పులు.. ఇద్దరు మృతి!

By

Published : Jun 22, 2020, 3:23 PM IST

అమెరికా, ఉత్తర కరోలీనా నగరంలో దారుణం జరిగింది. చార్లొట్టే, బియట్టీస్​ ఫోర్డ్​లో నడిరోడ్డుపై కాల్పులకు తెగబడ్డారు కొంతమంది దుండగులు . ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తూటాలు తాకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాల్పులకు తెగబడ్డ తర్వాత దుండగులు.. మరికొందరిని వాహనాలతో ఢీకొనిగాయపరిచారని పోలీస్​ ఉన్నతాధికారి.. జెన్నింగ్స్​ తెలిపారు. ఓ పాదచారి సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వందలాదిమంది.. వీధుల్లో పరుగులు తీస్తూ కనిపించారని ఆయన పేర్కొన్నారు.

అయితే, రోడ్డుపై వెళ్తున్న అమాయకులపై కాల్పులు జరిపింది ఎవరన్నది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:ట్రంప్ ప్రచార శంఖారావం- ఫస్ట్ షో ఫ్లాప్​!

ABOUT THE AUTHOR

...view details