అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కొలరాడోలోని బౌల్డర్ నగరంలో ఓ సాయుధుడు స్టోర్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
స్టోర్లోకి చొరబడిన నిందితుడు.. పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పలువురికి గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు.