ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా.. శునకాల్ని చూసుకునే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి ఆమె రెండు ఫ్రెంచ్ జాతి శునకాల్ని ఎత్తుకెళ్లారు. అమెరికాలోని లాస్ఏంజలస్లో ఉత్తర సియోర్రా బోనిటా అపార్ట్మెంట్ వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
కేర్‌టేకర్‌ను కాల్చి 'లేడీ గాగా' శునకాల అపహరణ - లాస్ఎంజిలస్
పాప్ సింగర్ లేడీగాగా శునకాల్ని చూసుకునే వ్యక్తిని.. గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. అతని వద్దనున్న ఆమె శునకాల్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

లేడీగాగా శునకాల్ని చూసుకునే వ్యక్తిపై కాల్పులు
లేడీ గాగా శునకాల్ని చూసుకునే వ్యక్తి రోజూ లాగే మూడు శునకాలతో బయటికి వచ్చాడు. అందులో ఒక శునకం పారిపోయింది. ఆ శునకం కోసం అతను వెతుకుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆ శునకాల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించగా అతను అడ్డుకున్నాడని జోనాథన్ ట్రిప్పెట్ అనే పోలీసు తెలిపారు. అయితే ఆ దుండగుల్ని సంరక్షకుడు అడ్డుకోబోగా అతనిపై వారు తుపాకీతో కాల్పులు జరిపారని వెల్లడించారు. లేడీ గాగా సినిమా షూటింగ్ కోసం రోమ్ వెళ్లినట్లు తెలిపారు.