Police kill teen girl: అమెరికాలో ఓ దుండగుడి దుశ్చర్య కారణంగా 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపగా.. తూటా తగిలి డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆమె మరణించింది.
అసలేమైందంటే..?
Los angeles firing: లాస్ ఏంజెలెస్‌లోని బర్లింగ్టన్ స్టోర్‌లో మారణాయుధంతో ఓ దుండగుడు.. మహిళపై దాడికి పాల్పడుతున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. అదే స్టోర్‌లో మరో వ్యక్తిపై నిందితుడు దాడికి పాల్పడుతుండగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
అయితే.. కాల్పుల సమయంలో ఓ బుల్లెట్.. డ్రెస్సింగ్ రూమ్ గోడలో నుంచి దూసుకెళ్లి.. అందులో ఉన్న టీనేజర్‌కు తగిలింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని లాస్ఏంజెలెస్ పోలీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ చీఫ్ డోమినిక్ చోయ్ తెలిపారు. అది మూమాలు గోడే అని భావించి తాము కాల్పులు జరిపామని చెప్పారు. ఘటన అనంతరం.. లోపల టీనేజర్ మరణించి కనిపించిందని పేర్కొన్నారు.