తెలంగాణ

telangana

ETV Bharat / international

కాల్పుల కలకలం- 8 మంది మృతి - హ్యూస్టన్​లో కాల్పులు

అమెరికాలోని హ్యూస్టన్​, ఫ్లోరిడా నగరాల్లో కాల్పుల కలకలం చెలరేగింది. రెండ్లు చోట్ల జరిగిన వేరు వేరు ఘటనల్లో మొత్తంగా 8 మంది చనిపోయారు.

Four shot dead in Houston
అమెరికాలో కాల్పులు

By

Published : Sep 6, 2021, 1:08 AM IST

Updated : Sep 6, 2021, 6:18 AM IST

అమెరికాలో తుపాకీ సంస్కృతి ప్రాణాలు తోడేస్తోంది . ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్​లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో స్వైరవిహారం చేయడం వల్ల నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ బాలింత , ఆమె ఒడిలో ఒదిగిన శిశువు కూడా ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ధరించిన సైకో జరిపిన కాల్పుల్లో లేల్యాండ్ లోని ఓ ఇంట్లో 11 ఏళ్ల బాలిక , బాలింత, ఆమె ఒడిలోని శిశువు మృతిచెందారు. పొరుగింట్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది . ఆగంతుకుడి పై కాల్పులు జరిపిన పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు . అనంతరం ఆస్పత్రిలో చేర్చారు. అయితే కాల్పులకు కారణం ఏమిటన్నది పోలీసులు వెల్లడించలేదు.

ఫ్లోరిడాలో మరో నాలుగురు..

అగ్రరాజ్యం అమెరికాలోని హ్యూస్టన్​లో ఓ ఇంట్లోని వారిపై కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలో ఇద్దరు పెద్దలు,మరో ఇద్దరు పిల్లలు చనిపోయారు. తుపాకితో కాల్చడం కారణంగా వారు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ ప్రాంతంలోనికి ప్రవేశించేదానికి ఎవరికీ అనుమతి లేదని అన్నారు. ఆయితే ఈ ఘటన సుమారు ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగినట్లు పేర్కొన్నారు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

మృతుల్లో పెద్దవారికి సుమారు 50 ఏళ్లుకు పైగా వయసు ఉంటుందని, పిల్లలకు అయితే 10 నుంచి 13 ఏళ్లు ఉండే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:In Pictures: చెత్తకుప్పలా మారిన కాబుల్ విమానాశ్రయం

Last Updated : Sep 6, 2021, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details