అమెరికా విస్కాన్సిన్లోని ఓ క్యాసినోలో కాల్పులకు తెగబడిన సాయుధుడిని పోలీసులు మట్టుబెట్టారు. గ్రీన్బేలోని ఓనైడా క్యాసినోలో జరిగిన ఈ కాల్పులు యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. ఘటన సమయంలో బుల్లెట్ల వర్షం కురిసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
"నిర్దిష్టమైన లక్ష్యంతోనే దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. అతను కాల్చాలనుకున్న వ్యక్తి అక్కడ లేదు. కానీ ఆ వ్యక్తి స్నేహితులు, సహోద్యోగులను కాల్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది."