అమెరికా సిన్సిన్నటి నగరంలో ఆదివారం తుపాకుల మోత మోగింది. గంటన్నర వ్యవధిలోనే మూడు చోట్ల కాల్పుల ఘటనలు జరిగాయి. మొత్తం నలుగురు మృతి చెందగా, 18మందికి తూటాల గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం ఉదయం 12:30 గంటలకు అవోండేల్ ప్రాంతంలో కాల్పుల జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. 21 ఏళ్ల యువకుడు ఆంటోనియో బ్లెయిర్కీ తీవ్ర గాయాలయ్యాయి. అతడిని యూనివర్సిటీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురికీ బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని కూడా అదే ఆస్పత్రికి తరలించారు.
అనంతరం 2:15 గంటలకు ఓవర్ ద రైనీ ప్రాతంలో మరో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. ఈ ఘటనలో 10మంది గాయపడ్డారు. ఒక్కరు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.