అమెరికాలోని రోడ్ ఐలాండ్ రాష్ట్ర రాజధాని ప్రావిడెన్స్లో జరిగిన కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. ఈ ఘటనలో 9 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
వాషింగ్టన్ పార్క్ వద్ద ఉన్న ఓ ఇంటిపై దుండుగులు కారులోంచి కాల్పులకు పాల్పడ్డారని.. దానిని ప్రతిఘటిస్తూ ఆ ఇంట్లోని వారు తిరిగి కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. రెండు బృందాల మధ్య కొంతసేపు కాల్పులు జరిగాయని తెలిపారు. గత కొంత కాలంగా రెండు బృందాల మధ్య ఏర్పడిన అనిశ్చితే ఈ కాల్పులకు దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.