తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా బాల్టిమోర్​లో కాల్పుల కలకలం - US

అమెరికా బాల్టిమోర్​లో ఓ దుండగుడు విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. వీధిలో వంటకాల కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.

Baltimore violence

By

Published : Apr 29, 2019, 7:49 AM IST

అమెరికా బాల్టిమోర్​లోని వీధిలో వంట ఉత్సవాల్లో భాగంగా గుమికూడిన సమూహంపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.

శనివారం కాలిఫోర్నియాలోని యూదుల ప్రార్థనా స్థలంలో దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరుసటి రోజే ఈ హింసాకాండ జరిగింది.

ఇదీ చూడండి: క్యాట్​వాక్​ చేస్తూ పడిపోయాడు.. ప్రాణాలు వదిలాడు

ABOUT THE AUTHOR

...view details